English | Telugu

బ‌జ్ః విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి తండ్రిగా మైక్ టైస‌న్!?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమా `లైగ‌ర్`. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాక్స‌ర్ రోల్ లో ఎంట‌ర్టైన్ చేయ‌నున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. `ఇస్మార్ట్ శంక‌ర్` (2019) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన‌ ఈ క్రేజీ వెంచ‌ర్.. విజ‌య్ కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో త‌యారైంది. `అర్జున్ రెడ్డి` (2017) రిలీజ్ డేట్ అయిన ఆగ‌స్టు 25ని టార్గెట్ చేసుకుని `లైగ‌ర్` ఈ ఏడాది జ‌నం ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉంటే, `లైగ‌ర్`లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఓ ముఖ్య పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో విజ‌య్ తండ్రిగా మైక్ టైస‌న్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నార‌ట‌. `అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి`(2003)లో మాస్ మ‌హారాజా ర‌వితేజ - అత‌ని తండ్రి పాత్ర‌ధారి ప్రకాశ్ రాజ్ మ‌ధ్య ఎలాగైతే ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాలు ఉంటాయో.. అలాంటివే వేరే కోణంలో `లైగ‌ర్`లో డిజైన్ చేశార‌ట పూరి. ఇక‌, విజ‌య్ కి త‌ల్లిగా - మైక్ టైస‌న్ కి భార్య‌గా ర‌మ్య‌కృష్ణ క‌నిపించ‌నున్నారు. మ‌రి.. భారీ అంచ‌నాల న‌డుమ రాబోతున్న `లైగ‌ర్` .. నేష‌న‌ల్ వైడ్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.