English | Telugu

ఛ..ఛ..మహేశ్‌కి కనీసం ఇది కూడా తెలియదా..?

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న స్పైడర్ మూవీ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు ఈ సినిమా రిలీజ్‌కు బోలెడన్ని అవాంతరాలు ఎదురువుతున్నాయి. స్పైడర్‌ను సెప్టెంబర్ 22న గానీ..27న గానీ రిలీజ్ చేస్తామని నిర్మాతలు అనౌన్స్ చేశారు. అయితే సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనే ఇప్పుడు లేని పోని చిక్కులను తెచ్చిపెడుతుంది.

సాధారణంగా ద్విభాషా చిత్రం తీయాలనుకున్నప్పుడు కొన్ని సూత్రాలను దర్శకనిర్మాతలు ఫాలో అవుతుంటారు. లాంగ్ షాట్స్, కొన్ని కీ సన్నివేశాలు, పాటలను అలాగే వేరే భాషలోకి యాజ్‌టీజ్‌గా దించేస్తుంటారు. స్పైడర్‌కు వచ్చేసరికి చిత్రయూనిట్ ఇదే ఫార్ములాను ప్లాన్ చేసింది. అయితే మహేశ్ దీనికి అభ్యంతరం తెలిపారట. తెలుగులో ఉన్న సహజత్వం..తమిళ్‌ వెర్షన్‌లోనూ ఉండాలని పట్టుబట్టడంతో ప్రతీ సన్నివేశాన్ని రెండేసి సార్లు చిత్రీకరిస్తున్నారట. దీంతో నిర్మాతలు తలపట్టుకుంటున్నారట..ఎందుకంటే ఒక సన్నివేశాన్ని ఒక భాషలో తీయడానికే బోలెడన్ని టేకులు కావాలి..అలాంటి అదే సన్నివేశాన్ని మరో భాషలో అచ్చం అలాగే తీయాలంటే తలకు మించిన భారమే..దీంతో షూటింగ్ పూర్తికాక..రిలీజ్ డేట్‌లో క్లారిటీ మిస్సవుతోందట. ఈ ఆలస్యం ఒక్క స్పైడర్‌నే కాక కొరటాల సినిమాను కూడా ఇబ్బంది పెడుతోంది. ఇది చూసిన వారంతా మహేశ్ ఏంటీ ఇలా చేస్తున్నాడు అనుకుంటున్నారు.