English | Telugu
'బ్రహ్మోత్సవం'లో టాప్ సినిమాటోగ్రాఫర్
Updated : May 12, 2015
మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి 'బ్రహ్మోత్సవం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సాకేంతిక వర్గం ఎంపిక కూడా దాదాపు పూర్తయింది. చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా సినిమాటోగ్రాఫర్ ఎంపిక జరిగింది. టాప్ సినిమాటోగ్రాఫర్‌గా ఆర్. రత్నవేలు ఈ చిత్రానికి సైన్ చేశారు. ఈ విషయాన్ని ఆయన దృవీకరించారు. రత్నవేలు కెమరా అంటే విజువల్ ఫీస్ట్ ఖాయం. శంకర్ 'రోబో' ఆయన కెమెరా నుండి జాలువారిందే. ఇంతకుముందు మహేష్ 'వన్' కు పని చేశారాయన. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేక పోయినప్పటికీ, టేకింగ్ స్టాండర్స్ మాత్రం అద్భుతం. అద్భుతమైన విజువల్స్ వుంటాయా సినిమాలో. ఇప్పుడు మరోసారి మహేష్ తో జతకట్టారాయన. సో.. మరో విజువల్ ఫీస్ట్ రెడీ అన్నమాట.