English | Telugu

త్రిషకి మంచిపనైందంటున్న రాయ్ లక్ష్మీ

ఫ్రెండ్ పెళ్లి పెటాకులైందని ఆ బ్యూటీ పండుగ చేసుకుంటోందట. అదేంటి ఎవరైనా ఫ్రెండ్ పెళ్లి ఆగిపోతే బాధపడతారు కానీ సంబరం ఎందుకంటారా? అబ్బో దానికి చాలా కథ ఉంది. త్రిష కన్నా ముందే వరుణ్ మణియన్ తో రాయ్ లక్ష్మీకి పరిచయం ఉందట. వీళ్లిద్దరూ ప్రేమపాటలు పాడుకుంటున్న సమయంలో మధ్యలో వచ్చిచేరిందట త్రిష. కాస్త జోరెక్కువైన చెన్నై చంద్రం....ఫ్రెండ్ ను పక్కనపెట్టి వరుణ్ ని అల్లుకుపోయింది. మ్యాటర్ ను పెళ్లివరకూ లాక్కొచ్చేసింది. దీంతో రాయ్ లక్ష్మీ పూర్తిగా సైడ్ అయిపోవాల్సి వచ్చింది. ఫ్రెండ్ మోసం చేసిందని...త్రిష పెద్ద అబద్ధాలకోరు అని మీడియా ముందు స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. రీసెంట్ గా త్రిష పెళ్లి పెటాకులైందనే న్యూస్ రావడంతో లక్ష్మీ ఉబ్బితబ్బిబ్బైందవుతోందట. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని కామెంట్ చేస్తోందట. పెళ్లిమాట పక్కనపెడితే వరుణ్ కారణంగా ఫ్రెండ్స్ ఇద్దరూ విడిపోయారు...అదీ మేటర్.