English | Telugu

`పుష్ప - ద రూల్`లో కృతి ఆటాపాటా!?

ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో తెర‌కెక్కిన `పుష్ప - ద రైజ్`.. నేష‌న‌ల్ వైడ్ ఏ రేంజ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ మ‌రింతగా పెరిగింది. అలాగే, ద‌ర్శ‌కుడిగా సుకుమార్ కూడా మ‌రో మెట్టు ఎదిగాడు. కాగా, `పుష్ప‌` సెకండ్ పార్ట్ `పుష్ప - ద రూల్` తాలూకు చిత్రీక‌ర‌ణ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే, `పుష్ప - ద రైజ్`లో స‌మంత చేసిన ఐట‌మ్ సాంగ్ ``ఊ అంటావా మామా`` సంచ‌ల‌నం సృష్టించిన నేప‌థ్యంలో.. `పుష్ప - ద రూల్`లో కూడా స్పెష‌ల్ సాంగ్ ని డిజైన్ చేస్తోంద‌ట సుక్కు అండ్ టీమ్. అంతేకాదు.. ఈ పాట‌లో ఓ బాలీవుడ్ బ్యూటీ చిందేయ‌బోతున్న‌ట్లు బ‌జ్. ఇదివ‌ర‌కు `లోఫ‌ర్` భామ దిశా ప‌టాని పేరు ఈ పాట కోసం వినిపించ‌గా.. లేటెస్ట్ గా కృతి స‌న‌న్ ఈ లిస్ట్ లో చేరింది. వాస్త‌వానికి కృతి కెరీర్ సుకుమార్ రూపొందించిన `1 నేనొక్క‌డినే`(2014)తోనే ప్రారంభ‌మైంది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు కృతి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ఏదేమైనా సుక్కు అడ‌గాలే గానీ.. స్పెష‌ల్ సాంగ్ లో ఆడిపాడేందుకు కృతికి పెద్ద‌గా అభ్యంత‌రాలు ఉండ‌క‌పోవ‌చ్చు కూడా. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో!?