English | Telugu
ప్రభాస్ తో కృతి శెట్టి రొమాన్స్!?
Updated : Mar 16, 2022
సెన్సేషనల్ హిట్ `ఉప్పెన`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. అనతికాలంలోనే క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాదు.. `ఉప్పెన`, `శ్యామ్ సింగ రాయ్`, `బంగార్రాజు` చిత్రాలతో హ్యాట్రిక్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `ద వారియర్`, `మాచర్ల నియోజక వర్గం` సినిమాలున్నాయి.
ఇదిలా ఉంటే, తాజాగా కృతి శెట్టికి ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కిందట. ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి ఓ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ముగ్గురు కథానాయికలకు స్థానముందని సమాచారం. వారిలో ఒకరిగా ఇప్పటికే `మాస్టర్` బ్యూటీ మాళవికా మోహనన్ కన్ఫామ్ అయిందని బజ్. కాగా, సెకండ్ లీడ్ గా కృతి శెట్టిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రభాస్ లాంటి పాన్ - ఇండియా స్టార్ తో జోడీ కట్టే అవకాశం కావడంతో కృతి కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తోందని టాక్. త్వరలోనే ప్రభాస్ - మారుతి కాంబో మూవీలో కృతి శెట్టి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.