English | Telugu

అల్లు అర్జున్ `ఐకాన్`లో కృతి శెట్టి?

సెన్సేష‌న‌ల్ హిట్ `ఉప్పెన‌`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. తొలి ప్ర‌య‌త్నంలోనే కుర్ర‌కారుని ఫిదా చేసింది. క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి చేతిలో `శ్యామ్ సింగ రాయ్`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ బైలింగ్వ‌ల్ మూవీ, `బంగార్రాజు` వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త‌క్కువ గ్యాప్ లోనే ఈ నాలుగు సినిమాలు థియేట‌ర్స్ లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే.. త్వ‌రలో ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ ఓ స్టార్ హీరోతో జ‌ట్టుక‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని టాలీవుడ్ బ‌జ్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా `వ‌కీల్ సాబ్` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ `ఐకాన్` పేరుతో ఓ పాన్ - ఇండియా మూవీని రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌మున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో ఇప్ప‌టికే ఓ హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైంద‌ని స‌మాచారం. కాగా, సెకండ్ లీడ్ గా కృతి శెట్టిని సెలెక్ట్ చేశార‌ని టాక్. త్వ‌ర‌లోనే `ఐకాన్`లో కృతి ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. బ‌న్నీతో ఫ‌స్ట్ టైమ్ జోడీక‌డుతున్న కృతి ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

ప్ర‌స్తుతం సుకుమార్ రూపొందిస్తున్న పాన్ - ఇండియా మూవీ `పుష్ప‌`లో న‌టిస్తున్నాడు అల్లు అర్జున్. రెండు భాగాలుగా రూపొందుతున్న స‌ద‌రు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ పూర్త‌య్యాకే `ఐకాన్`ని ప‌ట్టాలెక్కిస్తాడ‌ని వినికిడి.