English | Telugu
షాహిద్ కపూర్ కి జోడీగా కృతి శెట్టి!?
Updated : Mar 21, 2022
తెలుగునాట వరుస విజయాలతో, వరుస అవకాశాలతో ముందుకు సాగుతోంది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. గత ఏడాది క్రిస్మస్ స్పెషల్ గా విడుదలై ఘనవిజయం సాధించిన `శ్యామ్ సింగ రాయ్` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ హిందీ కథానాయకుడు షాహిద్ కపూర్ హీరోగా ఈ పునర్జన్మల బేస్డ్ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కాబోతోందని సమాచారం. కాగా, మాతృకలో కృతి శెట్టి పోషించిన కీర్తి పాత్ర కోసం కృతి అయితేనే బావుంటుందని యూనిట్ భావించిందట. అంతేకాదు.. కృతి శెట్టితో ఈ మేరకు సంప్రదింపులు కూడా జరిపారట. కృతి కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని సమాచారం. త్వరలోనే `శ్యామ్ సింగ రాయ్` బాలీవుడ్ వెర్షన్ లో కృతి శెట్టి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. తెలుగులో డెబ్యూ మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి.. హిందీలోనూ అదే బాట పడుతుందేమో చూడాలి.
కాగా, కృతి తాజా చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` విడుదలకు సిద్ధమైంది. మరోవైపు.. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న `మాచర్ల నియోజక వర్గం`, `ద వారియర్` సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.