English | Telugu
శర్వానంద్ తో కీర్తి సురేశ్ రొమాన్స్!?
Updated : Mar 24, 2022
ప్రస్తుతం చేతినిండా సినిమాలున్న కథానాయికల్లో కేరళకుట్టి కీర్తి సురేశ్ ఒకరు. రైట్ నౌ ఈ ముద్దుగుమ్మ తెలుగులో `సర్కారు వారి పాట`, `భోళా శంకర్`, `దసరా` వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. `సర్కారు వారి పాట`లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జోడీగా నటిస్తున్న కీర్తి సురేశ్.. `భోళా శంకర్`లో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. అలాగే `దసరా`లో నేచురల్ స్టార్ నాని సరసన సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే, తాజాగా కీర్తి మరో టాలీవుడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. శర్వానంద్ కథానాయకుడిగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులో తొలుత హీరోయిన్ గా `ఉప్పెన` భామ కృతి శెట్టి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, కొన్ని కారణాల వల్ల కృతి శెట్టి తప్పుకోవడంతో.. కీర్తి సురేశ్ ని సంప్రదించారట. కథ, పాత్ర నచ్చడంతో కీర్తి ఓకే చెప్పిందని బజ్. త్వరలోనే శర్వానంద్ - కృష్ణచైతన్య కాంబో మూవీలో కీర్తి సురేశ్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. శర్వానంద్ - కీర్తి సురేశ్ ఫస్ట్ కాంబినేషన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.