English | Telugu

పవన్ చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తున్నాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మార్చి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పవన్ నెక్ట్స్ మూవీపై ఫిలింనగర్‌లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్, ఆర్‌టీ నీసన్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటు మరో సినిమా సినిమా చేయాలని డిసైడయ్యాట పవర్‌స్టార్..అది కూడా మరో రీమేక్ స్టోరీనే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అట్లీ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటించిన తేరీ సినిమాను రీమేక్ చేయాలని పవన్ భావిస్తున్నాడట. దీనికి కందిరీగ, రభస సినిమాలకు దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్‌ను డైరెక్టర్‌గా తీసుకోవాలని భావిస్తున్నాడట.

అయితే పవన్ తాజా చిత్రం కాటమరాయుడు గతంలో అజిత్ హీరోగా తెరకెక్కిన వీరమ్ ‌మూవీకి రీమేకే..అది తమిళ్‌లో రిలీజై.. వీరుడొక్కడే పేరుతో తెలుగులోనూ విడుదలైంది..మళ్లీ ఇప్పుడు కాటమరాయుడు, అంటే ప్రేక్షకులు ఒకే కథను మూడు సార్లు చూసినట్లు లెక్క. ఇప్పుడు మళ్లీ తేరీ గనుక పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే సేమ్ సీన్ రిపీట్ అవుతుంది..మరీ అంత ఓపిక ప్రేక్షకులకు ఉందా..? లేదంటే తేరిని రీమేక్ చేయాలని అనుకొన్నా కాటమరాయుడు రిజల్ట్‌ని బట్టి నిర్ణయం తీసుకోవాలని పవన్ భావిస్తూ ఉండవచ్చు. లేక ఇది గాలివార్తా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.