English | Telugu

ఎన్టీఆర్, ప్రభాస్, చెర్రీ సినిమాల్లోకి రాకపోయుంటే..?

ప్రజంట్ టాలీవుడ్‌లో టాప్ హీరోలుగా ఎదుగుతున్న వారిలో ఎన్టీఆర్, ప్రభాస్, చెర్రీలు ముందు వరుసలో ఉంటారు. వాళ్ల తాతలు, తండ్రులు అల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మరో ఆప్షన్ లేకుండా మనోళ్లు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఒకవేళ వాళ్లు ముగ్గురు సినిమాల్లోకి రాకపోయుంటే ఎలా ఉండేవారు..మన లాంటి వాళ్లని ఆ ప్రశ్న అడిగి ఉంటే ఏదో చెబుతాం కానీ ముగ్గురితో అత్యంత సన్నిహితంగా మెలిగిన రాజమౌళి లాంటి వారిని అడిగితే..ఒక కార్యక్రమంలో పాల్గొన్న జక్కన్నను ఇదే ప్రశ్న అడిగారు కొందరు..అందుకు ఆయన తారక్ అయితే రాజకీయాలలో ఉంటారని..ప్రభాస్ అయితే చెఫ్‌గా సెటిల్ అయ్యుండే వాడని, రామ్‌చరణ్ అయితే బిజినెస్‌మెన్‌గా ఉండేవాడని అదిరిపోయే సమాధానాలు ఇచ్చాడు.