English | Telugu

ప్ర‌భుదేవాకు ఇప్ప‌టికే రెండో పెళ్ల‌యిపోయిందా?

కొరియోగ్రాఫ‌ర్‌, యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ ప్ర‌భుదేవా త్వ‌ర‌లో త‌న మేన‌కోడ‌లిని రెండో వివాహం చేసుకోబోతున్నాడంటూ మీడియాలో కొద్ది రోజులుగా క‌థ‌నాలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టికే సెప్టెంబ‌ర్‌లోనే త‌న ముంబై నివాసంలో ఆయ‌న రెండో వివాహం చేసుకున్నాడ‌నే స‌మాచారం ఉంద‌ని వెబ్ పోర్ట‌ల్ సిఫీ డాట్ కామ్ వెల్ల‌డించింది. అది రాసిన క‌థ‌నం ప్ర‌కారం త‌న వెన్ను గాయానికి చికిత్స చేసిన ఫిజియోథెర‌పిస్ట్‌ను ఆయ‌న వివాహం చేసుకున్నాడంట‌. పెళ్లి ముంబైలో జ‌ర‌గ‌గా, ప్ర‌స్తుతం ఆ జంట చెన్నైలో కాపురం పెట్టిందంట‌.

త‌న భార్య పేరును, ఇత‌ర వివ‌రాల‌ను త‌న క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా ఆయ‌న చెప్ప‌లేద‌ని సిఫీ రాసుకొచ్చింది. అయితే ఈ క‌థ‌నాల‌కు ప్ర‌భుదేవా ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు. త‌న మొద‌టి భార్య ర‌మ్‌ల‌త్‌కు ఆయ‌న 2011 మొద‌ట్లో విడాకులు ఇచ్చాడు. ప‌ని విష‌యానికి వ‌స్తే స‌ల్మాన్ ఖాన్ హీరోగా ఆయ‌న డైరెక్ట్ చేసిన రాధే విడుద‌ల‌కు రెడీ అవుతోంది. అలాగే త‌మిళంలో రెండు మూడు సినిమాల్లో ఆయ‌న హీరోగా న‌టిస్తున్నాడు.