English | Telugu

`పుష్ప‌`లో బోట్ ఫైట్?

`1 నేనొక్క‌డినే`, `నాన్నకు ప్రేమ‌తో`, `రంగ‌స్థ‌లం` చిత్రాల్లో పోరాట ఘ‌ట్టాల‌ను ఎంతో ప్ర‌త్యేకంగా తీర్చిదిద్ది జేజేలు అందుకున్నారు ద‌ర్శ‌కుడు సుకుమార్. ఇప్పుడిదే శైలిని త‌న అప్ క‌మింగ్ మూవీ `పుష్ప‌`లోనూ కొన‌సాగించ‌నున్నార‌ట ఈ బ్రిలియంట్ డైరెక్ట‌ర్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. రెండు భాగాలుగా రూపొందుతున్న `పుష్ప‌`లో కీల‌క స‌న్నివేశంలో ఓ బోట్ ఫైట్ వ‌స్తుంద‌ట‌. ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే ఈ యాక్ష‌న్ సీక్వెన్స్.. `పుష్ప‌` ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌లో ఒక‌టిగా నిలుస్తుంద‌ని స‌మాచారం. అంతేకాదు.. తెలుగు తెర‌పై ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన బోట్ ఫైట్స్ కంటే ఎంతో భిన్నంగా ఈ సీక్వెన్స్ ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప‌`రాజ్ గా టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అత‌నికి జోడీగా ర‌ష్మిక మంద‌న్న ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఫాహ‌ద్ ఫాజిల్ ప్ర‌తినాయ‌కుడిగానూ సునీల్, అన‌సూయ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లోనూ న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు.

క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్న టీమ్.. త్వ‌ర‌లోనే చిత్రీక‌ర‌ణ‌ని పునః ప్రారంభించ‌నుంది.