English | Telugu

బన్నీ డీజేకి రెమ్యూనరేషన్ తీసుకోలేదు..కానీ..!

ఈమ‌ధ్య క‌థానాయ‌కులు తెలివి మీరిపోయారు. పారితోషికానికి బ‌దులు కొన్ని ఏరియాల హ‌క్కులో, సినిమాలో వాటానో రాయించుకొంటున్నారు. అది మంచి లాభాల్నే తెచ్చిపెడుతోంది. తాజాగా అల్లు అర్జున్ కూడా ఈ బిజినెస్సులోకే దిగిపోయాడ‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. బ‌న్నీ కొత్త చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈసినిమాపై ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే ఈ సినిమా కోసం బ‌న్నీ పారితోషికం తీసుకోలేద‌ట‌.

తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా జిల్లాల రైట్స్ బ‌న్నీ త‌న ద‌గ్గ‌రే ఉంచుకొన్నాడ‌ని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమాని ఆయా ఏరియాల్లో రిలీజ్ చేయ‌నున్నారు. స‌రైనోడు సినిమా ఈ మూడు ఏరియాల్లో క‌లిపి దాదాపు రూ.15 కోట్లు తెచ్చుకొంది. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌కీ మంచి క్రేజ్ ఉందిప్పుడు. దానికి తోడు మంచిసీజ‌న్‌లో విడుద‌ల అవుతోంది. బాహుబ‌లి.. హ‌వా త‌గ్గిన త‌రుణంలో, పోటీగా పెద్ద సినిమాలేవీ లేని స‌మ‌యంలో డీజే వ‌స్తున్నాడు. సినిమా బాగుంటే రూ15 కోట్లు రాబ‌ట్లుకోవ‌డం ఏమంత క‌ష్టం కాదు. బ‌న్నీ పారితోషికం రూ.10 కోట్ల‌లోపే. అదే సినిమా హిట్ట‌యితే ఏకంగా రూ.15 కోట్లు తెచ్చుకోవొచ్చు. బ‌న్నీ ప్లాన్ అదిరిపోయింది క‌దూ.