English | Telugu

బన్నీ సెట్‌లో హీరోయిన్లని అంత టార్చర్ చేస్తాడా..?

హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా డీజే. ఈ మూవీలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మామూలుగా హీరోయిన్లు తాము పనిచేసిన కో-స్టార్స్‌ గురించి చెబుతూ ఉంటారు. అయితే డీజేలో తాను అల్లుఅర్జున్‌తో పడ్డ టార్చర్ గురించి వివరిస్తూ ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వివాదాస్పదంగా మారిన గుడిలో ఒడిలో బడిలో సాంగ్‌లో బన్నీతో కలిసి పోటీపడి నటించడానికి తాను చెమటలు పట్టేలా స్టెప్స్ వేశాను అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇంత కష్టపడుతుంటే సాయం చేయాల్సింది పోయి..పైగా కుర్చీలో దర్జాగా కూర్చొని రిహార్సల్స్ చేయిస్తున్నాడని అందుకు సాక్ష్యం కావాలంటే చూడండి అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది పూజ. దానిని చూసిన వారంతా బన్నీలో చాలా యాంగిల్స్ ఉన్నాయంటున్నారు.