English | Telugu

మొమైత్ ఖాన్‌ని ఎన్టీఆర్ అరెస్ట్ చేస్తాడా..? పోలీసులు చేస్తారా..?

జాతీయ స్థాయిలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా క్రేజీ రియాలిటీ షోగా మారిన బిగ్‌బాస్ షోను దేశంలోని వివిధ భాషల్లో అక్కడి స్టార్ సెలబ్రిటీస్‌ను హోస్ట్‌గా పెట్టి చేయిస్తున్నారు నిర్వాహకులు..ఇప్పుడు ఈ షోకు తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు అనే సరికి దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 16 నుంచి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో 12 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు..60 కెమెరాలు అమర్చిన ఓ పెద్ద భవనంలో వీరంతా 70 రోజుల పాటు కలిసి ఉంటారు. ఇంత స్పీడుగా ఏర్పాట్లు జరుగుతున్న వేళ బిగ్‌బాస్‌ నిర్వాహకులకు ఊహించని షాక్ తగిలింది.

టాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తోంది..ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ కొంతమంది ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేసింది..ఇదే ఇప్పుడు పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టింది..బిగ్‌బాస్‌లో షోలో పాల్గొననున్న వారిలో మొమైత్ ఖాన్ కూడా ఉన్నట్లు ఫిలింనగర్‌ టాక్..అదే విధంగా పోలీసులు నోటీసులు పంపిన వారిలో కూడా ఆమె ఉన్నారని వార్తలు వచ్చాయి. రేపటి నుంచి ప్రారంభంకానున్న బిగ్‌బాస్‌ రూల్స్ ప్రకారం ఈ షోలో పాల్గొనేవారికి 70 రోజుల పాటు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు..అంటే ఆల్‌మోస్ట్ హౌస్ అరెస్ట్. మరోవైపు డ్రగ్స్ కేసులో విచారణకు పోలీసులు ఇచ్చిన గడువు ఈ నెల 19 నుంచి 27. మరి మొమైత్ షో నుంచి తప్పుకుంటుందా..? లేక బిగ్‌బాస్ షో రూల్స్‌ని బ్రేక్ చేస్తుందా అన్నది వేచి చూడాలి.