English | Telugu
మరో రీమేక్ లో మెగాస్టార్!?
Updated : Mar 19, 2022
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఐదు సినిమాలున్నాయి. వాటిలో `ఆచార్య` విడుదలకు సిద్ధమవుతుండగా.. `గాడ్ ఫాదర్`, `మెగా 154`, `భోళా శంకర్` సెట్స్ పై ఉన్నాయి. `మెగా 156` త్వరలోనే పట్టాలెక్కనుంది. కాగా, వీటిలో `గాడ్ ఫాదర్`, `భోళా శంకర్` రీమేక్స్ అన్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం `లూసీఫర్`కి రీమేక్ గా `గాడ్ ఫాదర్` రూపొందుతుంటే.. తమిళ సినిమా `వేదాళమ్` ఆధారంగా `భోళా శంకర్` తెరకెక్కుతోంది.
ఇదిలా ఉంటే, తాజాగా మెగాస్టార్ మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్, వెర్సటైల్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో రూపొందిన మలయాళ సినిమా `బ్రో డాడీ` ఇటీవల ఓటీటీలో స్ట్రీమ్ అయింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఈ మూవీని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇందులో మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి నటించే అవకాశముందని బజ్. త్వరలోనే `బ్రో డాడీ` రీమేక్ లో మెగాస్టార్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇంతకుముందు ఇదే మూవీ రీమేక్ విషయంలో విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జున పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. మరి.. చివరాఖరికి ఈ రీమేక్ లో ఏ స్టార్ నటిస్తారో చూడాలి.