English | Telugu
చిరుకి అది 'కత్తి' మీద సామే!
Updated : Dec 21, 2015
చిరంజీవి 150వ సినిమాగా కత్తి రీమేక్ చేస్తున్నారగానే అభిమానుల్లో ఆనందించినవాళ్లకంటే.. సందేహించినవాళ్లే ఎక్కువ. ఎందుకంటే... కత్తి రీమేక్‌కీ ఇప్పుడు అన్నయ్య చిరంజీవి ఉన్న పరిస్థితికీ ఎక్కడైనా లింకు కుదిరిందా అన్నదే వాళ్ల డౌటు. ఈ సందేహానికీ ఓ రీజన్ ఉంది.
కత్తిని తమిళంలో విజయ్ చేశాడు. విజయ్ ఏజ్‌కీ..చిరూ ఈజ్‌కీ చాలా తేడా ఉంది. దానికి తోడు.. ఆ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం పోషించాడు. ఒకటి పెద్ద తరహా పాత్ర.. రెండోది కుర్ర పాత్ర. రెండింటికీ న్యాయం చేశాడు. పెద్ద తరహా పాత్రలకు చిరు ఓకే.. నో డౌట్ బాగానే సెట్టయిపోతాడు. మరి కుర్ర పాత్రకు సరిపోతాడా, లేదా అన్నదే ఆ అనుమానాలకు కారణం.
చిరు ఇప్పుడు ఓ ఇరవై ఏళ్లు తగ్గించుకొని, కుర్రాడిలా హుషారుగా నటించడం.. చాలా కష్టమైన విషయమే. దానికి తోడు కెమెరా ముందు `నటించడం` తనకు బొత్తిగా అలవాటు తప్పిపోయింది. అందుకే కత్తి రీమేక్ ని కొన్నాళ్లు దూరం పెట్టాడు చిరు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో కత్తి రీమేక్‌ని భుజాలపై వేసుకొన్నాడు. నిజానికి రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించడం చిరుకి కత్తి మీద సవారీనే. ఎలా నెగ్గుకొస్తాడో, ఏమో..??