English | Telugu

బ‌జ్ః వ‌న్స్ మోర్.. బాల‌య్య - బోయ‌పాటి కాంబో!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను ఒక‌రు. `సింహా`, `లెజెండ్`, `అఖండ‌`.. ఇలా జ‌ట్టుక‌ట్టిన ప్ర‌తీసారి ఈ కాంబో బ్లాక్ బ‌స్టర్ కొడుతూ వ‌స్తోంది. అంతేకాదు.. ఈ మూడు సినిమాల్లోనూ బాల‌య్య ద్విపాత్రాభిన‌యంతో అల‌రించ‌డం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల షేర్ దాటిన 'అఖండ' ప్ర‌భంజ‌నం!

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం `అఖండ‌` ఘ‌న‌విజ‌యాన్ని ఆస్వాదిస్తున్న బాల‌య్య‌, బోయ‌పాటి.. త్వ‌ర‌లో నాలుగోసారి క‌లిసి ప‌నిచేసే అవ‌కాశ‌ముంద‌ని టాక్. అంతేకాదు.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ ఈ హ్యాట్రిక్ కాంబినేష‌న్ తో సినిమా నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంద‌ని వినిపిస్తోంది. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

'అఖండ'.. సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది!

కాగా, `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మ‌లినేని, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో బాల‌య్య త‌న త‌దుప‌రి చిత్రాలు చేయ‌బోతున్నారు. ఇక బోయ‌పాటి శ్రీ‌ను విష‌యానికి వ‌స్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో గీతా ఆర్ట్స్ సంస్థ‌లో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. సో.. ఈ క‌మిట్మెంట్స్ అయ్యాకే బాల‌య్య - బోయపాటి కాంబో మూవీ ప‌ట్టాలెక్క‌వ‌చ్చేమో. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో!