English | Telugu

ధనరాజ్ నా మీద అలా పగ తీర్చుకున్నాడు..!

తెలుగు రియాలిటీ షోలలో సంచలనం కలిగించిన బిగ్‌బాస్ సీజన్-1 ముగింపు దశకు చేరుకుంది. ఎన్టీఆర్ తన దగ్గరున్న అన్ని రకాల విద్యలను ప్రదర్శిస్తూ షోను రక్తి కట్టించాడు..అంతేనా..స్టార్ మా ఛానెల్‌ను టీఆర్పీలలో నెంబర్ వన్ పోజిషన్‌లో పెట్టాడు. 10 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో చివరికి ఐదుగురు ఫైనల్‌‌కు చేరగా అంతిమంగా విజేత ఎవరో ఈ వారం తెలిసిపోనుంది. అయితే లేట్‌గా వచ్చినా బిగ్‌బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చేసి ఆడియన్స్‌లో ఎంగ్జయిటిని తెచ్చింది దీక్షా పంత్. వైల్డ్ కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె గతవారం ఎలిమినేట్ అయ్యింది. హౌస్ నుంచి సొంత హౌస్‌కి చేరుకున్న దీక్ష సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ తనను ఒక శత్రువులా చూసేవారని..ముఖ్యంగా అర్చన అయితే తననే టార్గెట్ చేయడం బాధ కలిగించిందని చెప్పింది..నేను ఎంతగా కాంప్రమైజ్ అవ్వాలనుకున్నా ఛాన్సిచ్చేది కాదని వాపోయింది. అన్నింటికన్నా ముందు ధనరాజ్‌‌‌తో తాను బంతిపూల జానకీ సినిమా చేశానని..ఆ సమయంలో మనిద్దరం బయట కలుద్దామని అడిగేవాడని..అందుకు తాను ఒప్పుకోకపోయే సరికి..కక్ష కట్టి బిగ్‌బాస్‌ షోలో తనను ఇబ్బందులకు గురిచేసేవాడిని తెలిపింది.