English | Telugu

బాహుబ‌లి... ఎవ‌రి పారితోషికం ఎంత‌?


తెలుగు నాటే కాదు.. యావ‌త్ భార‌త‌దేశ సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కొత్త రికార్డులు సృష్టించింది బాహుబ‌లి. తొలి భాగం సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యితే.. బాహుబ‌లి 2 అంత‌కు మించిన విజ‌యాన్ని అందుకొని ప‌రిశ్ర‌మ సైతం నివ్వెర పోయేలా చేసింది. బాహుబ‌లి రెండు భాగాలూ క‌లిపి వ‌సూళ్లు లెక్క‌గ‌డితే రెండు వేల కోట్ల‌కుపైగానే వ‌చ్చిన‌ట్టు. మ‌రి.. ఇంత గొప్ప వ‌సూళ్లు సాధించిన చిత్రానికి గానూ.. ఎవ‌రెవ‌రికి ఎంతి ఇచ్చారు? బాహుబ‌లితో ఎవ‌రెంత సొమ్ము చేసుకొన్నారు. వీటిపై ఓ స్ప‌ష్ట‌మైన స‌మాచారం అందింది. మ‌రి ఎవ‌రి పారితోషికం ఎంతో చూద్దామా?


బాహుబ‌లి రెండు భాగాల నిమిత్త‌మూ ప్ర‌భాస్ దాదాపు రూ.30 కోట్ల పారితోషికం అందుకొన్నాడ‌ని స‌మాచారం. ముంద‌స్తు ఒప్పందం అయితే రూ.20 కోట్ల‌లోపే. కానీ... బాహుబ‌లి సాధించిన అనూహ్య వ‌సూళ్ల దృష్ట్యా చిత్ర‌బృందం మ‌రో రూ.10 కోట్లు అద‌నంగా ఇచ్చార‌ని తెలుస్తోంది. భ‌ళ్లాల‌దేవ‌గా న‌టించిన రానాకు రూ.12 కోట్లు ముట్టిన‌ట్టు సమాచారం. అష్క‌కు రూ.5 కోట్లు, త‌మ‌న్నాకు 2 కోట్లు ద‌క్కాయ‌ట‌. శివ‌గామి పాత్ర‌లో క‌నిపించిన ర‌మ్య‌కృష్ణ‌కు 3 కోట్లు, క‌ట్ట‌ప్ప‌కు 2 కోట్లు, నాజర్‌కి రూ.80 ల‌క్ష‌లు ముట్ట‌జెప్పార‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళికి రూ.40 కోట్ల పారితోషికం అందింద‌ని స‌మాచారం. అంటే.. పారితోషికంలో నెంబ‌ర్ వ‌న్ జ‌క్క‌న్నే అన్న‌మాట‌.