English | Telugu

అంజలికి అక్కడ కలిసిరావడం లేదు

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన తెలుగు అమ్మాయి అంజలి..కెరియర్ మొదట్లోనే తన పిన్ని క్రియేట్ చేసిన వివాదంలో చిక్కుకొని ఎన్నో ఇబ్బందులు పడి, ఆ వివాదాల నుంచి ఎలాగోలా బయటపడి వరుస తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ గా గడుపుతుంది.ఇంతలోనే అంజలి ఇంకో వివాదంలో చిక్కుకుంది.

యువ కథానాయకుడు విమల్‌తో కలిసి ఆమె నటించిన ‘మాప్పిల సింగం’ సినిమాకు సంబంధించి నిర్మాతలు అంజలిపై కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఏడాది కిందట మొదలైంది. దీని కోసం అంజలి 55 రోజుల కాల్‌ షీట్స్‌ ఇచ్చిందట. ఐతే షూటింగ్‌ ప్రణాళిక ప్రకారం జరగలేదు. అంజలి డేట్స్‌ వృథా అయిపోయాయి. దీంతో మళ్లీ కాల్‌షీట్స్‌ ఇవ్వాలని, చెన్నైకి వచ్చి షూటింగ్‌లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారట నిర్మాతలు.

ఐతే తానిప్పుడు రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నానని.. వాటి కోసం హైదరాబాద్‌లోనే ఉంటున్నానని.. ఇంతకుముందు ఇచ్చిన కాల్‌షీట్స్‌ వృథా చేశారు కాబట్టి హైదరాబాద్‌లోనే షూటింగ్‌ పెట్టుకోమని తేల్చిచెప్పిందట అంజలి. కానీ నిర్మాతలు మాత్రం చెన్నైలోనే షూటింగ్‌.. రాకుంటే నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేస్తాం.. కేసు పెడతాం అని బెదిరిస్తున్నారట. మరి ఈ వివాదాన్ని అంజలి ఎలా పరిష్కరించుకుంటుందో ఏమో!