English | Telugu
తారక్ తో అనిల్ రావిపూడి?
Updated : Apr 1, 2022
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన `పటాస్` (2015)తో దర్శకుడయ్యాడు అనిల్ రావిపూడి. మొదటి ప్రయత్నంలోనే మెమరబుల్ హిట్ అందుకున్న అనిల్.. ఆపై `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `సరిలేరు నీకెవ్వరు` వంటి విజయవంతమైన చిత్రాలతో ఎంటర్టైన్ చేశాడు. త్వరలో `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3`తో పలకరించబోతున్నాడు. వేసవి కానుకగా మే 27న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ విడుదల కానుంది.
ఇదిలా ఉంటే, `ఎఫ్ 3` తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. అంతేకాదు.. బాలయ్య కాంబో మూవీ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తోనూ ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట రావిపూడి. ఇందులో భాగంగా ఇప్పటికే తారక్ కి స్టోరీ లైన్ కూడా వినిపించాడని బజ్. ప్రముఖ నిర్మాత `దిల్` రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని ప్రచారం సాగుతోంది. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, `ఆర్ ఆర్ ఆర్`తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్.. త్వరలో కొరటాల శివ కాంబోలో ఓ పాన్ - ఇండియా మూవీ చేయబోతున్నారు. ఆపై బుచ్చిబాబు సానా, ప్రశాంత్ నీల్ తోనూ తారక్ జట్టుకట్టబోతున్నారు. వాటి తరువాతే అనిల్ రావిపూడి సినిమా కార్యరూపం దాల్చే అవకాశముందంటున్నారు.