English | Telugu
రామ్ తో పూరి హీరోయిన్ రొమాన్స్!?
Updated : Feb 21, 2022
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం `పందెం కోడి` కెప్టెన్ లింగు స్వామి దర్శకత్వంలో `ద వారియర్` అనే బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రామ్ సరసన `ఉప్పెన` భామ కృతి శెట్టి దర్శనమివ్వనుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ కాప్ డ్రామా.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది.
ఈ లోపే మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించనున్నాడు రాపో. దర్శకుడిగా బోయపాటికి ఇది 10వ సినిమా కాగా, హీరోగా రామ్ కి 20వ చిత్రం. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని `ద వారియర్` ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరినే నిర్మించనున్నారు.
Also Read:'దృశ్యమ్ 2' షూటింగ్ మొదలుపెట్టిన అజయ్ దేవ్‌గణ్, శ్రియ
కాగా, ఈ సినిమాలో రామ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటించే అవకాశముందని టాక్. ఇప్పటికే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `లైగర్`లో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకి జంటగా నటించింది అనన్య. ఆగస్టు 25న ఈ పాన్ - ఇండియా స్పోర్ట్స్ డ్రామా థియేటర్స్ లోకి రాబోతోంది. మొత్తమ్మీద.. బ్యాక్ టు బ్యాక్ పాన్ - ఇండియా మూవీస్ తో అనన్య టాలీవుడ్ లో సందడి చేయనుందన్నమాట. త్వరలోనే రామ్ - బోయపాటి సినిమాలో అనన్య ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.