English | Telugu

ప‌వ‌న్‌తో కాళ్ల‌బేరానికి దిగుతున్న బ‌న్నీ

చెప్ప‌ను బ్ర‌ద‌ర్ - అనే ఒకే ఒక్క డైలాగ్ ప‌వ‌న్ ఫ్యాన్స్‌కీ బ‌న్నీకీ మ‌ధ్య దూరం పెంచేసింది. ఇంత వ‌ర‌కూ అల్లు అర్జున్‌కి స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చిన ప‌వ‌న్ ఫ్యాన్స్ ఒక్క‌సారిగా యాంటీ అయిపోయారు. అయితే.. అల్లు అర్జున్ మాత్రం ఒక్క మెట్టూ దిగ‌క‌పోవ‌డం, చెప్ప‌ను బ్ర‌ద‌ర్ వివాదానికి వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆ దూరం పెరుగుతూ వ‌చ్చింది. వ‌ప‌న్ ఫ్యాన్స్ తో పెట్టుకొంటే య‌వ్వారం ఎంత వ‌ర‌కూ వెళ్తుందో.. డీజేకి వ‌చ్చిన డిజ్‌లైక్స్ తో తెలిసొచ్చింది బ‌న్నీకి. టీజ‌ర్‌కే ఇంత నెగిటీవ్ ప‌బ్లిసిటీ తీసుకొచ్చిన వాళ్లు రేపు సినిమా విడుద‌లైతే ఇంకేం చేస్తారో అన్న భ‌యం పెరిగిపోతోంది. అందుకే బ‌న్నీ ఈ విష‌యంలో కాళ్ల బేరానికి వ‌స్తున్న‌ట్టు స‌మాచారం.

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి బ‌న్నీ ఓ స్కెచ్ వేసేశాడు. డీజే ఆడియో ఫంక్ష‌న్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని ఆహ్వానిస్తే.. ఈ వివాదానికి ఓ పుల్ స్టాప్ పెట్టొచ్చ‌ని బ‌న్నీ భావిస్తున్నాడ‌ట‌. అందుకోసం హ‌రీష్ శంక‌ర్ ని ట్రంప్ కార్డ్‌లా వాడుకోవాల‌ని చూస్తున్నాడు బ‌న్నీ. హ‌రీష్‌కీ ప‌వ‌న్‌కీ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఓ అభిమానిగా హ‌రీష్ అడిగితే.. ప‌వ‌న్ కాద‌న‌లేడు. హ‌రీష్ కోస‌మైనా ప‌వ‌న్ ఈ ఆడియోకి వ‌స్తాడ‌న్న‌ది బ‌న్నీ గ‌ట్టి న‌మ్మ‌కం. అదే ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ గురించి నాలుగు మంచి ముక్క‌లు మాట్లాడి, చెప్ప‌ను బ్ర‌ద‌ర్ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాల‌ని, డీజే విడుద‌ల కు ముందే లైన్ క్లియ‌ర్ చేసుకొంటే, ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై కూడా ప‌డుతుంద‌ని బ‌న్నీ న‌మ్ముతున్నాడు. సో.. ప‌వ‌న్ - బ‌న్నీ ఒక్క‌టైపోవ‌డానికి ముహూర్తం కుదిరింద‌న్న‌మాట‌.