English | Telugu

స్వామికి చుక్కలు చూపెట్టిన బన్నీ..?

స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞాన్‌వేల్ రాజా నిర్మాతగా అల్లుఅర్జున్-తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కాంభినేషన్‌లో భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషల్లో సినిమా ఉంటుందని గ్రాండ్‌గా ఎనౌన్స్ చేయడం..ఆ వెంటనే చెన్నైలో చిన్న కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించి ప్రెస్ మీట్లు పెట్టడం అంతా జరిగి చాలా రోజులే అయ్యింది. కానీ ఆ సినిమా ఎంతకు సెట్స్ మీదకు వెళ్లకపోవడంతో ఇక ప్రాజెక్ట్ ఆగిపోయినట్లేనని పుకార్లు గుప్పుమన్నాయి.

సరైనోడు సినిమా జరుగుతున్న సమయంలోనే లింగుస్వామి కథను బన్నీకి చెప్పాడట..ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడట అర్జున్. అయితే దానికి కొన్ని మార్పులు చేయాలని సూచించాడట..వెంటనే కథను రీరైడ్ చేసి చూపించగా మళ్లీ కొన్ని చేంజస్ కావాలన్నాడట అల్లు వారబ్బాయి..ఇలా ఒకసారి కాదు రెండుసార్లు కాదు సుమారు 20 సార్లకు పైనే జరిగిందట..ఎంత చేసినా బన్నీకి తృప్తి కలగకపోవడంతో విసిగిపోయిన స్వామి మొత్తం ప్రాజెక్ట్‌నే పక్కనపెట్టేశాడని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. దీనికి తోడు అల్లు అర్జున్ డీజేతో..లింగుస్వామి విశాల్‌తో పందెం కోడి-2తో బిజీగా ఉండటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

అయితే కొద్ది రోజుల నుంచి బన్నీ-లింగుస్వామి మూవీ ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతుండటంతో లింగుస్వామి స్పందించారు. అల్లుఅర్జున్‌తో ద్విభాషా చిత్రం యధావిధిగా ఉంటుంది..అయితే అంతకంటే ముందు విశాల్‌తో పందెంకోడి-2 చేస్తున్నాను..బన్నీ కూడా డీజేతో బిజీగా ఉన్నారు..అవి పూర్తయ్యాక మా ఇద్దరి కాంభినేషన్‌లో సినిమా ఉంటుందని..పుకార్లు కట్టిపెట్టండి అంటూ ట్వీట్ చేశారు లింగుస్వామి.