English | Telugu

బ‌న్నీకి క్లాస్ పీకిన మెగాస్టార్‌..!

చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌.. అన్న ఒక్క మాట అల్లు అర్జున్‌ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి బ‌హిరంగ వేదిక‌లలో మాట్లాడ‌ని చెప్పి ఓ సంచ‌ల‌నానికి తెర లేపాడు బ‌న్నీ. ఆ త‌ర‌వాత ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ అదే మాట చెప్పాడు. దాంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ బ‌న్నీపై ఫైర్ అవ్వ‌డం, ఆ త‌ర‌వాత బ‌న్నీ ఒక మ‌న‌సు ఆడియో వేడుక‌లో దీనిపై క్లారిటీ ఇవ్వ‌డం తెలిసిందే. అయితే.. ఆడియో వేడుక‌లో బ‌న్నీ మాట్లాడిన తీరు చిరంజీవికి న‌చ్చ‌లేద‌ని టాక్‌. ఈ విష‌యంపై బ‌న్నీని పిలిచి క్లాస్ పీకాడ‌ట‌. బ‌న్నీ మాట్లాడిన తీరు చూస్తే.. ప‌వ‌న్‌కీ చిరుకీ మ‌ధ్య అడ్డుగోడ క‌ట్టిన‌ట్టుగా ఉంద‌ని చిరుకి ఆయ‌న స‌న్నిహితులు చెప్పార‌ట‌. దాంతో చిరంజీవి బ‌న్నీ మాట్లాడిన ఫుటేజ్ ఒక్క‌సారి గ‌మ‌నించి, బ‌న్నీని పిలిపించీ మ‌రీ క్లాస్ పీకార‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం ఇదే విష‌యంపై టాలీవుడ్‌లో ర‌క‌ర‌కాల వార్త‌లు విన‌వస్తున్నాయి. ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అయితే బాగోద‌ని, ఫ్యాన్స్ మ‌ధ్య గోడ క‌ట్టాల‌ని చూడొద్ద‌ని చిరు... బ‌న్నీకి చెప్పాడ‌ట‌. మెగా ఫ్యాన్స్‌, బ‌న్నీ ఫ్యాన్స్ అంటూ వేరుగా లేర‌ని... అంతా ఒక్క‌టే అని చిరు గ‌ట్టిగా చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఆల్ ఇండియా అల్లు ఫ్యాన్స్ అంటూ ఇటీవ‌ల ఓ అభిమాన సంస్థ నెల‌కొంది. ఈ విష‌యంపైనా చిరు గుర్రుగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. సొంత కుంప‌ట్లు పెట్టుకొంటే న‌ష్ట‌పోతావ‌ని సున్నితంగా హెచ్చ‌రించాడ‌ని సినీ వ‌ర్గాల భోగ‌ట్టా. పాపం... తెలిసో తెలీకో బ‌న్నీ అన్న ఒక్క మాట‌... అత‌న్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. దీన్నుంచి బ‌న్నీకి ఎప్పుడు విముక్తి ల‌భిస్తుందో మ‌రి.