English | Telugu

26న ‘జేమ్స్ బాండ్’ అల్లరి చేస్తాడట

అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘జేమ్స్ బాండ్’. . ‘నేను కాదు నా పెళ్లాం’ ట్యాగ్ లైన్. సాక్షి చౌదరి హీరోయిన్. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్. సాయి కార్తీక్ మంచి సంగీతాన్నందించారు. ప్రేక్షకులు నరేష్ చిత్రం ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి కామెడి ఎంటర్ టైనర్ మూవీ ఇది అని అన్నారు.

ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ, డ్యాన్స్: రాజసుందరం, గాయత్రి రఘురాం, ప్రసన్న, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: దాము నర్రావు, సంగీతం: సాయి కార్తీక్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికోశోర్ మచ్చ.