English | Telugu

పాపకి మసాలా సినిమాలు చేయాలనుందట!

హీరోయిన్ గా పేరు రాకముందు ఎలాంటి, ఏ తరహా పాత్రనైనా చేసేయాల్సిందే కానీ.. ఒక్కసారి హీరోయిన్ గా పేరొచ్చాక మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. స్టార్ డమ్ వచ్చేసింది కదా అని డబ్బు కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పేసుకొంటే అనతికాలంలోనే కెరీర్ షెడ్డుకెళ్ళిపోతుందన్నమాట.

అయితే.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా నడుచుకొంటోంది. కెరీర్ తొలినాళ్లలోనే లిప్ లాక్స్ కు సై అంటూ లేడీ సీరియల్ కిస్సర్ గా పేరు తెచ్చుకొన్న ఆలియా మొన్నామధ్య "షాందార్" సినిమాలో బికినీ ధరించి "బాబోయ్" అనిపించింది. ఇప్పుడేమో "నాకు మాంచి మసాలా సినిమాలు చేయాలనుంది" అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇప్పటికీ వయసుకు మించిన సినిమాలు చేస్తోందంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ఆలియా ఇప్పుడు మసాలా సినిమాలు చేస్తాను అంటూ ఉవ్విళ్ళురుతుండడంతో.. అమ్మడికి ఇప్పుడీ ఎక్స్ట్రాలు అవసరమా? అనుకొంటున్నారు!