English | Telugu

మహేష్ బాబుకి జోడీగా ఆలియా భట్!

'ఆర్ఆర్ఆర్' సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెడుతోంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. చరణ్ కి జోడీగా ఆలియా కనువిందు చేయనుంది. ఈ మూవీ మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు రాజమౌళి. అయితే అందులోనూ ఆలియానే హీరోయిన్ గా నటించనుందని న్యూస్ వినిపిస్తోంది.

'ఆర్ఆర్ఆర్' మూవీ ఇంకా విడుదల కాకముందే ఆలియా టాలీవుడ్ లో వరుస క్రేజీ ఆఫర్స్ పట్టేస్తోంది. ఇప్పటికే తారక్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న పాన్ ఇండియా మూవీలో నటించేందుకు ఆలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు మహేష్, రాజమౌళి కాంబో మూవీలోనూ ఛాన్స్ కొట్టేసిందని వార్తలొస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్'లో ఆలియా నటనకి ఇంప్రెస్ అయిన రాజమౌళి తన తదుపరి సినిమాకి కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ తో చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కోసం రాజమౌళి ఆలియాని ఎంపిక చేసినట్లు సమాచారం.

కొంతకాలంగా టాలీవుడ్ హీరోలతో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. 'ప్రాజెక్ట్ K'లో ప్రభాస్ కి జోడీగా నటిస్తున్న దీపికా పదుకోణె.. తారక్, అల్లు అర్జున్ సరసన నటించేందుకు ఆసక్తి చూపించింది. ఇప్పుడు ఆలియా కూడా చరణ్, తారక్, మహేష్ ఇలా వరుసగా టాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేయడానికి సిద్ధమవుతోంది.