English | Telugu

నాగ్ నిర్ణ‌యం.. నితిన్‌కి న‌చ్చ‌లేదు!

అఖిల్ సినిమా వాయిదా ప‌డ‌డంతో.. ఫ్యాన్సంతా ఉస్సూరుమంటున్నారు. కీల‌క‌మైన ద‌స‌రా సీజ‌న్‌లో అఖిల్‌సినిమా విడుద‌లైతే.... వ‌సూళ్లు కొల్ల‌గొట్టొచ్చ‌న్న‌ది వాళ్ల ఆలోచ‌న‌. అక్టోబ‌రు 22న సినిమా తీసుకురావాల‌ని చిత్ర‌బృందం ప్ర‌య‌త్నించినా.. ఫ‌లితం లేక‌పోయింది. వీఎఫ్ ఎక్స్ వ‌ల్ల ఈ సినిమా ఆల‌స్య‌మ‌య్యింది. సినిమాని వాయిదా వేయాల‌న్న‌ది టీమ్ మొత్తం తీసుకొన్న నిర్ణ‌యం. అయితే... అది నిర్మాత నితిన్‌కి న‌చ్చ‌లేద‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల టాక్‌.

నితిన్‌కే కాదు, అఖిల్‌కీ ఈ సినిమా వాయిదా వేయ‌డం ఇష్టం లేద‌ట‌.ద‌స‌రా సీజ‌న్‌లో విడుద‌ల చేస్తే.... సినిమా వ‌సూళ్లు అద్భుతంగా ఉంటాయ‌ని, ఆల్రెడీ అఖిల్ సినిమాపై బోల్డంత క్రేజ్ ఉంద‌ని, దాన్ని వాడుకొందామ‌న్న‌ది నితిన్ ఆలోచ‌న‌. ఈ సినిమా వాయిదా ప‌డ‌డం.. అఖిల్‌కీ ఏమాత్రం ఇష్టంలేదు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ... అఖిల్ కూడా 22న ఎట్టిప‌రిస్థితుల్లోనూ వ‌స్తాం.. అని ట్వీట్ చేసేవాడు. అయితే నాగార్జున‌మాత్రం ప‌ట్టుబ‌ట్ట‌డంతో నితిన్ కూడా త‌లొంచాల్సివ‌చ్చింది.

నాగ్‌.. ఒక్క స‌న్నివేశంలో వీ ఎఫ్ ఎక్స్ బాగోలేదు అని చెబుతున్నా.. సినిమా మొత్తం అలానే ఉంద‌ట‌. దాదాపు 20 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ అత్యంత నాశిర‌కంగా ఉండ‌డంతో.. నాగ్ ఈ నిర్ణ‌యంతీసుకొన్నాడ‌ని తెలుస్తోంది. `అఖిల్ తొలి సినిమా ది బెస్ట్‌గా ఉండాలి` అన్న‌దే నాగ్ ఆలోచ‌న‌. అయితే ద‌స‌రా సీజ‌న్‌ని క్యాష్ చేసుకోవాల‌ని నిర్మాత‌గా నితిన్ భావిస్తున్నాడు. చివ‌రికి నాగ్ మాటే నెగ్గింది.