English | Telugu

బన్నీ రుణం.. స్వీటీ తీర్చుకొంటోంది

ఆప‌ద‌లో ఉన్న అనుష్క చిత్రం... రుద్ర‌మదేవిని ఆదుకొని రియ‌ల్ హీరో అనిపించుకొన్నాడు అల్లు అర్జున్‌. బ‌న్నీ లేక‌పోతే... ఈ సినిమా ఇంత త్వ‌ర‌గా గ‌ట్టెక్కేది కాద‌ని, అనుష్క కూడా ఒప్పుకొంది. బ‌న్నీకి స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్పుకొంది. మాట‌ల్లోనే కాదు, చేత‌ల్లోనూ కృత‌జ్ఞ‌త చూపించ‌బోతోంద‌ట స్వీటి. బ‌న్నీ రుణం తీర్చుకొనేందుకు అనుష్క న‌డుం క‌ట్టింద‌ని టాలీవుడ్ టాక్‌. అదెలాగంటే...

అల్లు అర్జున్ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి స‌రైనోడు అనే టైటిల్ నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ఇందులో ఓ ఐటెమ్ గీతం కోసం క‌థానాయిక కావాలి. అందుకోసం... నెల రోజులుగా చిత్ర‌బృందం అన్వేష‌ణ జ‌రుపుతోంది. ఆఖ‌రికి ప్రియ‌మ‌ణితో ఎడ్జిస్ట్ అయిపోవాల‌ని బ‌న్నీ భావించాడు. ఇప్పుడు అనూహ్యంగా అనుష్క రేసులోకి వ‌చ్చింది. బ‌న్నీ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేయ‌డానికి స్వీటీ ఒప్పుకొంద‌ని టాలీవుడ్ టాక్‌.

వేదం, రుద్ర‌మ‌దేవిలో వీరిద్ద‌రూ క‌ల‌సి న‌టించినా.. హీరోహీరోయిన్లుగా కాదు. ప్ర‌ధాన పాత్ర‌లు మాత్ర‌మే. దాంతో ఇద్ద‌రూ క‌ల‌సి డాన్సింగులు చేసే అకాశం రాలేదు. ఈసారి స్పెష‌ల్‌సాంగ్ రూపంలో ఆ అవ‌కాశం వ‌చ్చింది. రుద్ర‌మదేవిని ఆదుకొన్నందుకు బ‌న్నీకి స్వీటీ ఇలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకొంటోందేమో. మొత్తానికి బ‌న్నీ, స్వీటీల డాన్సింగ్ షో చూసే అవ‌కాశం ద‌క్క‌బోతోంది.