English | Telugu

ఐష్, అభిల మధ్య దూరానికి కారణాలివే..?

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌లో ఒకటైన ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్‌ మధ్య దూరం పెరుగుతోందా..? ఐష్ అంటే బచ్చన్ ఫ్యామిలీకి అస్సలు పడటం లేదా..? గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య ఇంతటి అగాధానికి కారణాలేంటి.. కరణ్ జోహార్ దర్శకత్వంలో ఐష్ నటించిన మూవీ యే దిల్ హై ముష్కిల్...ఈ మూవీలో నలభై ఏళ్ల వయసులో కూడా హాట్ సన్నివేశాల్లో నటించింది మాజీ ప్రపంచ సుందరి. అది కూడా తన కన్నా ఎంతో చిన్నవాడైన రణబీర్‌ కపూర్‌తో ఈ విషయం అమితాబ్‌కు తెలియడంతో ఐష్‌ను వారించారట..అయినా ససేమిరా అనడంతో మామగారు కోడలిపై గుర్రుగా ఉన్నారట..

అంతకు ముందే ఆత్తగారు జయా బచ్చన్‌కి, ఐశ్వర్యారాయ్‌కి కోల్డ్‌వార్ నడుస్తుండటంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఇక అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఐష్ తన మాజీ ప్రియుడు సల్మాన్‌ఖాన్‌కు దగ్గరవ్వడమే. అంతకు ముందు సల్మాన్ అమితాబ్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు. అయితే ఐశ్వర్య కోడలిగా రావడంతో బచ్చన్ కుటుంబం సల్మాన్‌ను దూరం చేసుకుంది. అలాంటిది ఇప్పుడు అతని సినిమాలో హీరోయిన్‌‌గా నటించేందుకు ఐశ్వర్యరాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాల వలన ఆమె వైవాహిక జీవితం ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.