English | Telugu

పవన్ ఇలా చేశాడు.. మరి బాలయ్య పరిస్థితేంటీ..?

తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ ఎంత ప్రత్యేకమైనదో చెప్పక్కర్లేదు. ఈ టైంలో ఎన్ని సినిమాలు రిలీజైన ఆదరించే సత్తా తెలుగు జనాలకు ఉంది. అందుకే తమ సినిమా ఉండేలా చూసుకుంటారు దర్శకనిర్మాతలు. ఎప్పటిలాగే ఈ సారి సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలు పోటీలో నిలిచాయి. పవన్ అజ్ఞాతవాసిగా, బాలయ్య జైసింహాగా పోటీలో నిలిచారు. ఇక తమిళ స్టార్ హీరో సూర్య తన గ్యాంగ్‌తో దిగుతున్నాడు. అందరికన్నా ముందుగా ప్రేక్షకులను పలకరించాడు పవర్‌స్టార్. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన అజ్ఞాతవాసిపై ప్రేక్షకులతో పాటు టాలీవుడ్‌ మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. ఎన్నో అంచనాలతో థియేటర్‌ లోపలికి వెళ్లిన ప్రేక్షకులకు పవన్-త్రివిక్రమ్ నిరాశనే మిగిల్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అనుకున్న స్థాయిలో సినిమా లేకపోవడం.. కథ, కథనాల సాగదీతతో ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కానీ పండుగ టైం కావడంతో వసూళ్లు బావుంటాయనే టాక్ వినిపిస్తోంది. పవన్ విషయం తేలివడంతో ఇక అందరి దృష్టి నటసింహాం నందమూరి బాలకృష్ణ నటించిన జైసింహాపై పడింది. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు లేవు. అయితే ప్రీరిలీజ్ ఫంక్షన్ రోజు రిలీజ్ చేసిన ట్రైలర్‌లో బాలయ్య విన్యాసాలు చూస్తే.. ఏదో విషయం ఉన్నట్లుగానే కనిపిస్తోంది అంటున్నారు క్రిటిక్స్. జైసింహా రిజల్ట్‌ను బట్టి 2018 సంక్రాంతి స్టార్ ఎవరో తేలిపోనుంది. మరి బాలయ్య ఏం మేజిక్ చేశాడో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేస్తే చాలు.