English | Telugu
`రాక్షసుడు` సీక్వెల్ లో విజయ్ సేతుపతి?
Updated : Jul 14, 2021
తమిళ చిత్రం `రాక్షసన్` ఆధారంగా రూపొందిన `రాక్షసుడు` తెలుగునాట విజయపథంలో పయనించిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్.. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారిని బాగానే ఆకట్టుకుంది.
కట్ చేస్తే.. త్వరలో `రాక్షసుడు`కి సీక్వెల్ గా `రాక్షసుడు 2` రాబోతోంది. తాజాగా ఈ విషయాన్ని రమేశ్ వర్మ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. ఇందులో ఓ అగ్ర కథానాయకుడు నటించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇంతకీ ఆ బిగ్ హీరో ఎవరు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాకపోయినా.. కోలీవుడ్ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే.. ప్రతినాయకుడి పాత్రలో సేతుపతి కనిపించే అవకాశముందని అంటున్నారు. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. రమేశ్ వర్మ తాజా చిత్రం `ఖిలాడి` చిత్రీకరణ తుది దశలో ఉండగా.. విజయ్ సేతుపతి చేతిలో దాదాపు డజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి.