English | Telugu

పెళ్ళికిముందే 'వడ్డిస్తున్న' త్రిష

అందాల తార త్రిష త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ తొడిగించుకోబోతోంది. ఈ నెల 23న తన ప్రియుడు వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్థానికి త్రిష రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తన ఎంగేజ్‌మెంట్‌, పెళ్లికబురు విషయంలో ఏ గోప్యతా ఉండదని.. అన్నీ అందరికీ చెబుతానని చెప్పిన చెన్నై బ్యూటీ.. చెప్పినట్లే చేస్తోంది. ఐతే ఎంగేజ్‌మెంట్‌ చాలా సింపుల్‌గా చేసుకోవాలని.. సినీ పరిశ్రమ నుంచి ఎవరినీ ఆహ్వానించకూడదని త్రిష నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారు.ఐతే ఎంగేజ్‌మెంట్‌ తర్వాతి రోజు ఇటు తెలుగు, అటు తమిళ పరిశ్రమలకు చెందిన తన స్నేహితులు, శ్రేయోభిలాషులకు భారీ పార్టీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోందట త్రిష. మామూలుగా బ్యాచిలర్‌ పార్టీ అబ్బాయిలు ఇస్తారు కానీ.. త్రిష కూడా అదే రూట్లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పెళ్లికి ఎక్కువ ఆలస్యం చేయబోదని.. మార్చిలోనే ఆ కార్యక్రమం కూడా అయిపోతుందని అంటున్నారు. పెళ్లి కూడా సింపుల్‌గానే ఉంటుందని.. సినిమా వాళ్లను పిలవదని.. పెళ్లి తర్వాత రిసెప్షన్‌ మాత్రం గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్‌ చేస్తోందని సమాచారం.