English | Telugu

ప‌వ‌ర్‌స్టార్‌తో మ‌రోసారి త్రిష రొమాన్స్?

తమిళ‌, తెలుగు భాష‌ల్లో అగ్ర క‌థానాయిక‌గా వెలుగొందిన చెన్నై పొన్ను త్రిష‌.. హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్ర సీమ‌ల్లోనూ ఒక్కో సినిమాతో సంద‌డి చేసింది. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో ఈ టాలెంటెడ్ బ్యూటీ మాలీవుడ్ లో రెండో సినిమాతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. `దృశ్యం` సిరీస్ త‌రువాత మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, స్టార్ కెప్టెన్ జీతూ జోసెఫ్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న ఆ చిత్ర‌మే.. `రామ్`. ఇందులో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌ త్రిష‌.

కాగా, తాజాగా శాండిల్ వుడ్ లోనూ రెండో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట త్రిష‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ క‌థానాయ‌కుడిగా `లూసియా`, `యూ ట‌ర్న్` చిత్రాల ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ `ద్విత్వ‌` పేరుతో ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో క‌థానాయిక‌గా త్రిష న‌టించ‌బోతోంద‌ని క‌న్న‌డ చిత్ర వ‌ర్గాల స‌మాచారం. అదే గ‌నుక నిజ‌మైతే.. `ప‌వ‌ర్` (2014) త‌రువాత పునీత్ రాజ్ కుమార్ తో త్రిష జోడీక‌ట్టే సినిమా ఇదే అవుతుంది. `దూకుడు`కి రీమేక్ గా `ప‌వ‌ర్` రూపొంద‌గా.. `ద్విత్వ‌` మాత్రం స్ట్ర‌యిట్ పిక్చ‌ర్ అని టాక్. త్వ‌ర‌లోనే `ద్విత్వ‌`లో త్రిష ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. పునీత్, త్రిష జోడీ మ‌రోసారి అల‌రిస్తుందేమో చూడాలి.