English | Telugu

టాలీవుడ్ టాప్‌.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాస‌లీల‌!



అత‌ని పేరు చెబితే హుషారుకే హుషారొస్తుంది. అత‌ని పాట వింటే.... స్టెప్పు వేయాల‌న్నంత జోరొస్తుంది. టాలీవుడ్‌లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అత‌ను. సంగీతంలోనే కాదు.. `స‌ర‌సం`లోనూ దిట్టే అని చెప్తుంటారు అత‌ని గురించి తెలిసినోళ్లు. ఓ క‌థానాయిక‌తో ప్రేమ‌లో ప‌డిపోయాడ‌ని, ఇద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ న‌డుస్తోంద‌ని అప్ప‌ట్లో చెప్పుకొనేవారు. ఆ త‌ర‌వాత ఇద్ద‌రి మ‌ధ్య కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ ఆ బంధం చిగుర్లు వేసింద‌ని, ఇద్ద‌రూ మ‌ళ్లీ చెట్టాప‌ట్టాలేసుకొని తెగ తిరిగేస్తున్నార‌ని చెప్పుకొంటున్నారు.

ఇప్పుడు ఈ క‌థ‌లో మ‌రో క‌థానాయిక ఎం్రీ ఇచ్చింది. ఇటీవ‌ల టాప్ హీరోల స‌ర‌స‌న రెండో క‌థానాయిక పోస్టుకు ఈవిడ గ‌ట్టిపోటీదారు కూడా. ఇండ్ర‌స్ట్రీ రికార్డు సృష్టించిన ఓ సినిమాలో క‌థానాయిక‌గానూ న‌టించింది. ఇప్పుడు ఆ సంగీత ద‌ర్శ‌కుడు ఈమె మాయ‌లోనూ ప‌డిపోయాడ‌ని చెప్పుకొంటున్నారు. ఇద్ద‌రు క‌థానాయిక‌ల మ‌ధ్య‌... మ‌న్మ‌ధుడిలా ఈ సంగీత ద‌ర్శ‌కుడు మెరిసిపోతున్నాడ‌ట‌. ఆ విష‌యం ఆ క‌థానాయిక‌ల‌కూ తెలిసినా పెద్ద మ‌న‌సుతో స‌ర్దుకుపోతున్నార‌ని టాక్‌. మ‌రి ఈ లవ్ ట్రాక్ ఎంత కాలం న‌డుస్తుందో చూడాలి.