English | Telugu

న‌య‌న‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా?

శింబు - న‌య‌న‌తార‌ల ప్రేమాయణం గురించి తెలియంది కాదు. ఇద్ద‌రూ చ‌ట్టాప‌ట్టాలేసుకొని జాలీగా తీరిగారు. ప‌బ్లిక్ గా ముద్దులు పెట్టుకొన్నారు. ఇక పెళ్లి ఖాయ‌మ‌నుకొన్న ద‌శ‌లో వీరిద్ద‌రూ విడిపోయారు. ఇప్పుడు ఎవ‌రి జీవితాలు వారివి. న‌య‌న శింబు గురించి ప‌ట్టించుకోక‌పోయినా... శింబు మాత్రం న‌య‌న‌ను ఓ కంట క‌నిపెడుతూనే ఉన్నాడట‌. ఎప్ప‌టికైనా మ‌ళ్లీ త‌న‌ను క‌రుణించ‌క‌పోతుందా అని ఎదురుచూస్తున్నాడ‌ట‌. ఆ సూచ‌న‌లేం క‌నిపించ‌క‌పోయేస‌రికి ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ లోకి దిగ‌బోతున్న‌ట్టు త‌మిళ సినీ వ‌ర్గాల క‌థ‌నం. శింబు క‌థానాయ‌కుడిగా కెట్ట‌వ‌న్ అనే చిత్రం తెర‌కెక్కుతోంది. శింబు - న‌య‌న‌ల ప్రేమ వ్య‌వ‌హార‌మే ఈ చిత్ర క‌థాంశ‌మ‌ని తెలుస్తోంది. న‌య‌న తార‌కు సంబంధించిన అనేక ర‌హ‌స్యాల‌ను శింబు ఈ సినిమా ద్వారా బ‌య‌ట‌పెట్టాల‌నుకొంటున్నాడ‌ట‌. త‌మ ప్రేమ క‌థ ఎలా మొద‌లైంది? ఎవ‌రు ఎవ‌రికి ప్ర‌పోజ్ చేశారు? ఎందుకు విడిపోయారు అనే విష‌యాల్ని తెర‌పై చూపించ‌బోతున్నాడ‌ట శింబు. ఈ సినిమా క‌థ బ‌య‌ట‌కు పొక్కితే.. న‌య‌న త‌న దారిలోకి వ‌స్తుంద‌న్న మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు శింబు. మ‌రి ఈ సినిమాని న‌య‌న లైట్ తీసుకొంటుందో, లేదంటే శింబు దారిలోకి వెళ్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.