English | Telugu

మ‌హేష్‌కి అంత కాన్ఫిడెన్స్ ఏంటి?

బాహుబ‌లి దెబ్బ‌కి సినిమాల‌న్నీ బెదిరిపోతున్నాయి. బాహుబ‌లికి ముందూ, ఆ త‌ర‌వాత‌.. త‌మ సినిమాలు లేకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ బాహుబ‌లి జులై 10నే వ‌స్తుంద‌ని ఆశ‌. అందుకే జూన్‌లోనే సినిమాలు వ‌రుస క‌ట్టేస్తున్నాయి. రుద్ర‌మ‌దేవిలాంటి పెద్ద సినిమా కూడా బాహుబ‌లి వెళ్లాకే బ‌య‌ట‌కు వ‌ద్దాం అనుకొంటోంది. అయితే మ‌హేష్ బాబు స్ట్రాజ‌టీ మాత్రం వేరుగా ఉంది. బాహుబ‌లి జులై 10న అయితే.. శ్రీ‌మంతుడుని జులై 17న విడుద‌ల చేయ‌మ‌ని ఒత్తిడి తీసుకొస్తున్నాడు మ‌హేష్‌. చిత్ర‌బృందం కూడా దాదాపుగా ఈ డేట్‌కే త‌మ సినిమాని రిలీజ్ చేయాల‌ని ఫిక్స‌యింది. జులై 10న బాహుబ‌లి విడుద‌ల అవ్వ‌డం క‌ష్ట‌మ‌ని, ఈ సినిమా మ‌రోసారి వాయిదా ప‌డుతుంద‌న్న‌ది మ‌హేష్ కాన్ఫిడెన్స్ కావ‌చ్చు. ఒక వేళ సినిమా విడుద‌లైనా.. వారం త‌ర‌వాత ఆ జోరు త‌గ్గిపోతుంద‌న్న న‌మ్మ‌క‌మూ ఉండొచ్చు. అందుకే ఎట్టిప‌రిస్థితుల‌లోనూ జులై 17నే శ్రీ‌మంతుడు సినిమాని విడుద‌ల చేయాల‌ని ఫిక్స‌య్యాడు మ‌హేష్. ఈనెల 27న శ్రీ‌మంతుడు ఆడియోని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేసుకొంటున్నారు. మొత్తానికి మ‌హేష్ - ప్ర‌భాస్‌ల ర‌స‌వత్త‌ర పోటీకి జులై నెల వేదిక కాబోతోంద‌న్న‌మాట‌. ఫ్యాన్స్‌.. గెట్ రెడీ.