English | Telugu

వెంకీతో ‘శృతి’చేస్తుందా?

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం పెద్ద సమస్యగా మారింది. నాగ్, బాలయ్య, వెంకీ వీళ్లతో జత కట్టడానికి స్టార్ హీరోయిన్లు అంతగా ఇష్టపడడం లేదు. దీంతో వీరి సినిమాలు కొంచెం ఆలస్యంగా మొదలవుతున్నాయి. వెంకటేష్ దశరథ్ తో కలిసి చేయబోయే సినిమాకు ఇప్పటి నుంచే హీరోయిన్ వెదుకలాట మొదలుపెట్టారట. ఈ సినిమాలో క‌థానాయిక‌గా చాలామంది పేర్లు ప‌రిశీలించిచివ‌రికి శ్రుతిహాస‌న్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. అయితే ఈ కాంబినేష‌న్ అయ్యే ప‌నేనా అనేది కాస్త డౌటుటానే ఉంది. ఎందుకంటే న‌వ‌త‌రం క‌థానాయ‌కుల‌తో న‌టిస్తూ బిజీ బిజీగా ఉంది శ్రుతి. ఇలాంటి ద‌శ‌లో సీనియ‌ర్ల‌తో పెట్టుకోదు. వెంకీలాంటి అగ్ర హీరోతో న‌టించ‌డం ల‌క్కే అయినా.. ప్ర‌స్తుత‌మున్న పొజీష‌న్లో ఈ రిస్క్ శ్రుతి తీసుకొనే ఛాన్సుల్లేవు. వెంకీమీదున్న అభిమానంతో శ్రుతి ఒప్పుకొంటుందా..? లేదంటే తిప్పి కొడుతుందా?? వెయిట్ అండ్ సీ.