English | Telugu

శ్రుతిని డీల్ చేసేదెవరో?

తెలుగు దర్శకనిర్మాతలపై శ్రుతిహాసన్ రుసరుసలాడుతోంది. కనీసం మంచి క్యారెక్టర్ కూడా ఇవ్వరు కానీ పేద్ద కబుర్లు చెబుతారంటోంది. హీరోయిన్స్ సైతం సినిమా మొత్తం తమ భుజస్కందాలపై మోయగలం అంటోంది. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్టైన ఎన్‌హెచ్ 10’ , ‘పీకూ’ ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ ఇవన్నీ అమ్మాయిలు నడిపించిన సినిమాలే కదా అని క్లారిటీ కూడా ఇస్తుందండోయ్. అయితే ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం దక్షిణాది దర్శకనిర్మాతలకి కావాల్సింది హీరోయిన్స్ ఒళ్లు మాత్రమే అని ఎడా పెడా కడిగిపడేసింది. రచయితల సంగతి చెప్పేదేముంది వాళ్లవల్లే కదా ఈ కష్టాలన్నీ అని నిట్టూర్చిందట. హీరో అంటే పడిచచ్చి పోయే నాలుగు డైలాగ్స్ తప్పిస్తే హీరోయిన్ కి పవర్ ఫుల్ డైలాగ్సే రాయరు. హీరోయిన్స్ దిగజారిపోవడానికి అసలు కారణం రచయితలే అని అక్కసు వెళ్లగక్కింది. అంతేకాదు మరో ఆఫర్ కూడా ఇచ్చింది.....సరైన కథతో ఎవరైనా వస్తే డేట్స్ ఇచ్చేందుకు రెడీ అంది. ఇన్ని మాట్లన్నాక ఏ దర్శక నిర్మాత ధైర్యం చేస్తాడో చూద్దాం.