English | Telugu
సంజయ్, షారుఖ్ కాంబోలో `రాఖీ`?
Updated : Jul 16, 2021
బాలీవుడ్ లో మల్టిస్టారర్స్ కొత్తేమీ కాదు. అయితే, కొత్త కొత్త కాంబినేషన్స్ లో ఈ తరహా మల్టిస్టారర్స్ తెరకెక్కడం మాత్రం ప్రేక్షకులకు కనువిందే. త్వరలో అలాంటి ఓ కనువిందైన మల్టిస్టారర్ రాబోతోందని బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, `ఖల్ నాయక్` సంజయ్ దత్ కాంబినేషన్ లో ఓ బడా మల్టిస్టారర్ తెరకెక్కనుందని సమాచారం. అంతేకాదు.. ఈ భారీ బడ్జెట్ మూవీకి `రాఖీ` అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారని వినిపిస్తోంది. అయితే, ఈ చిత్రానికి దర్శక, నిర్మాతలెవరన్న విషయంపై మాత్రం స్పష్టత రావడం లేదు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. షారుఖ్ కథానాయకుడిగా నటించిన `ఓం శాంతి ఓం` (2007), `రా. వన్` (2011) చిత్రాల్లో సంజూ అతిథి పాత్రల్లో మెరిశారు. కట్ చేస్తే.. పదేళ్ళ తరువాత వీరిద్దరూ ఓ పూర్తిస్థాయి సినిమా కోసం కలిసి నటించేందుకు అంగీకరించడం వార్తల్లో నిలుస్తోంది. త్వరలోనే సంజు, షారుఖ్ కాంబో మూవీపై క్లారిటీ రానున్నది.
కాగా, ప్రస్తుతం `పఠాన్`తో షారుక్ బిజీగా ఉండగా.. సంజు చేతిలో `భుజ్`, `షంషేరా`, `కేజీఎఫ్ ఛాఫ్టర్ 2`, `పృథ్వీరాజ్` చిత్రాలున్నాయి.