English | Telugu
జక్కన్నా... పైసలు రాల్చవా??
Updated : Dec 4, 2015
ఆరొందల కోట్ల సినిమా తీసిన దర్శకుడు రాజమౌళి. ఆయన పారితోషికం అంటారా.. దాదాపు 20 కోట్ల వరకూ ఉంటుంది. సౌతిండియాలో అత్యధిక పారితోషికం తీసుకొనే దర్శకుల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉండాల్సిందే. అలాంటి రాజమౌళి మాత్రం మహా పిసినారిగా తయారయ్యాడు. హుద్ హుద్ వరదబాధితులి ఆదుకోవడానికి చిత్రసీమ మొత్తం ముందుకొచ్చి భారీ విరాళాలు ప్రకటిస్తున్న తరుణంలో.. రాజమౌళి పైసా రాల్చలేదు. ట్విట్టర్లలో మాత్రం తన ప్రగాఢ సానుభూతిని కట్టలు కట్టలుగా ప్రకటించేశాడు.
ఇప్పుడు చెన్నై వరదల ఉదంతంలోనూ అంతే. భారీ వర్షాలకు చెన్నై మునిగిపోయింది. కోట్లలో నష్టం వాటిల్లింది. అక్కడి ప్రజలకు తాగడానికి కనీసం మంచినీరు కూడా లేకుండా పోయింది. తెలుగు నాట స్టార్స్ అందరూ స్పందిస్తున్నారు.. తమకు తోచినంత సాయం ప్రకటిస్తున్నారు. కానీ... జక్కన్న మరోసారి తన పిసినారితనాన్ని ప్రదర్శించాడు.
ఇప్పటి వరకూ తన సాయమెంతో ప్రకటించలేదు. ట్విట్టర్లలో మాత్రం యధావిధిగా.. హడావుడి చేస్తున్నాడు. రాజమౌళి కనీసం సంపూర్ణేష్ బాబు అంత చేయడా..?? సంపూర్ణేష్‌కి కోట్లేమైనా ఉన్నాయా.. తన స్థాయిలో తాను రూ.50 వేల సాయం ప్రకటించి ఆదర్శంగా నిలిచాడు. మరి రాజమౌళి మాత్రం మాటలకే పరిమిత మయ్యాడు. వాటే పిటీ..!!