English | Telugu

మైత్రీలో రానా, శ‌ర్వానంద్ మ‌ల్టిస్టార‌ర్?

టాలెంటెడ్ స్టార్ రానా దగ్గుబాటి.. క్ర‌మంగా మ‌ల్టిస్టార‌ర్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి `భీమ్లా నాయ‌క్` చేస్తున్న రానా.. త్వ‌ర‌లో త‌న బాబాయ్, విక్ట‌రీ వెంక‌టేశ్ తో క‌లిసి నెట్ ఫ్లిక్స్ కోసం `రానా నాయుడు` అనే వెబ్-సిరీస్ తో సంద‌డి చేయ‌నున్నారు. అంతేకాదు.. తాజాగా మ‌రో మ‌ల్టిస్టార‌ర్ కి కూడా రానా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని బ‌జ్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్.. త్వ‌ర‌లో రానాతో ఓ మ‌ల్టిస్టార‌ర్ ప్లాన్ చేస్తోంద‌ట‌. ఇందులో రానాతో పాటు మ‌రో యంగ్ హీరో శ‌ర్వానంద్ కూడా న‌టించే అవ‌కాశ‌ముందంటున్నారు. ఇద్ద‌రి పాత్ర‌ల‌కి కూడా స‌మ‌ప్రాధాన్య‌త ఉంటుంద‌ని వినికిడి. అలాగే, ఓ నూత‌న ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ మ‌ల్టిస్టార‌ర్ కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి.. రానా, శ‌ర్వానంద్ కాంబోలో రాబోతున్న ఈ మ‌ల్టిస్టార‌ర్ ఎలాంటి క‌థాంశంతో తెర‌కెక్క‌నుందో చూడాలి.

కాగా, సిద్దార్థ్ తో క‌లిసి శ‌ర్వానంద్ న‌టించిన మ‌ల్టిస్టార‌ర్ `మ‌హాస‌ముద్రం` విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 14న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. దీనికి `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.