English | Telugu
గీతాంజలిలో 'అంజలి' లేదు
Updated : Dec 18, 2014
హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చి, చిన్న సినిమాల్లో మంచి విజయం సాధించిన గీతాంజలి చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనికోసం ఈ టీమ్ లో చాలా మార్పులు చేస్తున్నట్లు వినికిడి. ఈ సినిమా కోసం ముఖ్యంగా అంజలిని మార్చాలని నిర్మాతలు నిర్ణయించారట. గీతాంజలికి రూ.40 లక్షలు అందుకొన్న అంజలి, ఇప్పుడు తన రేంజ్ పెరిగిందని 75లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఆ డబ్బుతో సినిమానే తీసేయొచ్చని, అంజలిని పక్కన పెట్టారు. అలాగే గీతాంజలి నిర్మాత ఆసక్తి చూపించలేదో ఏమిటో, అందువల్ల క్రేజీ మీడియా పతాకంపై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తారట.