English | Telugu

సూపర్ స్టార్ ని పడేసిన రకుల్‌‌!!

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పీడు మామూలుగా లేదండీ బాబోయ్‌. ఇప్పటికే గోపీచంద్‌, మంచు మనోజ్‌, రామ్‌ లాంటి మోడరేట్‌ హీరోల పక్కన ఆడి పాడేసి.. స్టార్‌ హీరోలు రవితేజ, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ లాంటి స్టార్‌ హీరోల పక్కన అవకాశం కొట్టేసిన ఈ ఢిల్లీ భామ.. వీటన్నింటికంటే పెద్ద ఆఫర్‌ కొట్టేసినట్లు టాలీవుడ్‌ తాజా సమాచారం. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సరసన కూడా రకుల్‌ నటించబోతోందట. ఆ సినిమా మరేదో కాదు.. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘బ్రహ్మూెత్సవం’. టాలీవుడ్‌లో మిగతా హీరోలందరితో నటించడం ఓ ఎత్తు. పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబులతో నటించడం మరో ఎత్తు. ఎంత స్టార్‌ స్టేటస్‌ సంపాదించిన ఈ ఇద్దరితోనూ నటించాలన్న కోరిక ప్రతి హీరోయిన్‌కూ ఉంటుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ లాంటి చిన్న సినిమాతో టాలీవుడ్‌ కళ్లల్లో పడ్డ రెండేళ్లకే రకుల్‌ ఈ స్థాయికి చేరడం మామూలు విషయం కాదు. ముందు బ్రహ్మూెత్సవం సినిమా కోసం ముందు సమంతను సంప్రదించారని.. హీరోయిన్‌గా ఆమే ఖాయం అని వార్తలు వినిపించాయి. ఐతే ఇప్పుడు రకుల్‌ రేసులోకి వచ్చింది. ఈ సినిమాలో ముగ్గురు భామలకు చోటుందంటున్నారు. మరి రకుల్‌.. సమంత ప్లేస్‌లోకి వచ్చిందా? లేక ఇద్దరూ కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారా?