English | Telugu

చ‌ర‌ణ్, వైట్ల సినిమాలో ఆ సీన్స్ లేవ‌ట‌

ఒక్కో డైరెక్ట‌ర్‌కి ఒక్కో ట్రేడ్ మార్క్ ఉంటుంది. ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల‌కి కూడా అలా ఓ ట్రేడ్ మార్క్ ఉంది. అదేమిటంటే.. యాక్ష‌న్ సినిమాల‌కు కామెడీని భ‌లే బాగా మిక్స్ చేసి మెప్పిస్తాడ‌ని. ఈ ట్రేడ్ మార్క్‌తో పాటు వైట్ల సినిమాలో త‌ప్ప‌కుండా కొన్ని సీన్స్ ఉంటాయి. అవేమిటంటే.. తాగుడు స‌న్నివేశాలు. త‌న‌కు బ్రేక్ తీసుకువ‌చ్చిన ఆనందం సినిమాతో మొద‌లుకుని గ‌త చిత్రం ఆగ‌డు వ‌ర‌కు ఏదో రూపంలో ఈ సీన్స్ కి చోటిచ్చి మాస్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకున్న వైట్ల‌.. రామ్ చ‌ర‌ణ్‌తో కొత్త‌గా తీస్తున్న సినిమా కోసం అలాంటి సీన్స్ లేకుండా రూపొందిస్తున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇందులో ఏ మాత్రం నిజ‌ముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. విశేష‌మేమిటంటే.. చ‌ర‌ణ్ తండ్రి చిరంజీవితో వైట్ల తెర‌కెక్కించిన అంద‌రివాడులో డ్రింకింగ్ సీన్స్ ఫుల్‌గా ఉంటే.. చ‌ర‌ణ్ సినిమాలో అవి నిల్‌గా ఉండ‌బోతుండ‌డం. మొత్త‌మ్మీద‌.. ఈ మార్పు మంచికే. కీపిట‌ప్ శ్రీ‌ను వైట్ల‌!