English | Telugu
నాన్నకు ప్రేమతో హైలెట్స్ ఇవే
Updated : Jan 9, 2016
భారీ అంచనాల మధ్య నాన్నకు ప్రేమతో సినిమా ఈనెల 13న విడుదల కాబోతోంది. శనివారం ఈ చిత్రం సెన్సార్ ముందుకు వెళ్తోంది. ఈలోగా ఈ సినిమాలోని హైలెట్స్ కొన్ని బయటకు వచ్చాయి.
* నిడివి రెండ గంటల 40 నిమిషాలట. సెన్సార్ అయ్యాక మరో పావు గంట సినిమా ట్రిమ్ చేసే అవకాశాలున్నాయి.
* ఎన్టీఆర్ పాత్ర చిత్రణే ఈ సినిమాకి అత్యంత పెద్ద హైలెట్ అని తెలుస్తోంది. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో హీరోలు చిత్రవిచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. ఈ సినిమాలోనూ ఎన్టీఆర్ పాత్ర అలానే డిజైన్ చేశాడట సుకుమార్. సరదాగా మాట్లాడుతూ మాట్లాడుతూ సీరియస్ అయిపోతాడట. ఎప్పుడో జరిగిన గొడవ గుర్తొచ్చి.. వాడ్ని వెదికి పట్టుకొని మరీ కొడతాడట. అలాంటి వెరైటీ సీన్లు ఈ సినిమా నిండా ఉన్నాయట.
* తండ్రీ కొడుకుల సెంటిమెంట్ అని చెబుతున్నా.. ఫాదర్‌తో సీన్లు కొన్నే ఉంటాయట. విలన్ పాత్రధారి జగపతిబాబుకీ - ఎన్టీఆర్‌కి మద్య నడిచే సన్నివేశాలు ఈ సినిమాకి మేజర్ హైలెట్.
* మైండ్ గేమ్ ఆధారంగా నడిచే సినిమా ఇది. మైండ్ గేమ్‌తో జగపతిబాబుని ఎన్టీఆర్ ఎదుర్కొనే సన్నివేశాలన్నీ బాగా వచ్చాయట.
* తాగుబోతు రమేష్ పాత్ర వెరైటీగా సాగుతుందని సమాచారం
* పతాక సన్నివేశాలకు అరగంట ముందు ఈ సినిమా ఓ రేంజులో ఉంటుందట. ఓ సీన్ దాదాపుగా 4 నిమిషాలకుపైగానే సాగుతుందట. అందులో ఎన్టీఆర్ ఎమోషనల్ డైలాగులు పలికే విధానం సింప్లీ సూపర్బ్ అని తెలుస్తోంది.
* యాక్షన్ ఎపిసోడ్‌ని తీర్చిదిద్దిన విధానం కూడా వెరైటీగా సాగిందని, ఓ ఫైట్‌లో ఎన్టీఆర్ డైలాగులు చెబుతూ.. రౌడీలనుకొట్టే సన్నివేశం బాగా టేకప్ చేశారని తెలుస్తోంది.
* ద్వితీయార్థం కాస్త డల్ అవ్వడం... ఒక్కటే కాస్త ఇబ్బంది పెట్టిందట. సినిమాని ట్రిమ్ చేస్తే.. ఆ లోటు కూడా ఉండదని తెలుస్తోంది. నిజంగానే ఈ సీన్లన్నీ వర్కవుట్ అయితే నాన్నకు ప్రేమతో ఈ సంక్రాంతి విజేతగా నిలవడం ఖాయం.