English | Telugu
ఎన్టీఆర్ సినిమా పేరు అదేనా?
Updated : Nov 3, 2014
ఎన్టీఆర్ - పూరి జగన్నాథ్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమా సెట్స్‌కి వెళ్లకముందే అనేక పేర్లు బయటకు వచ్చాయి. కుమ్మేస్తా, నేనోరకం, టెంపర్....ఇలా రకరకాలుగా అనుకొన్నారు. ఈ టైటిళ్లపై పూరి జగన్నాథ్ క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మరో పేరు బయటకు వచ్చింది. అదే... 'షంషేర్'. ఈ పేరు ఖాయమని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారమ్. ఈ సినిమాకి సంబంధించి ఓ ఫస్ట్ లుక్ రెడీ చేస్తున్నార్ట. ఆ సమయంలోనే టైటిల్ లోగో కూడా బయటపెడతారిని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రావాలా తరవాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆంధ్రావాలా బాక్సాఫీసు దగ్గర ఘోర పరాజయం పొందింది. ఎన్టీఆర్ ఫ్లాప్ ట్రాక్ ఆసినిమాతోనే మొదలైంది. ఇప్పుడు ఎన్టీఆర్ వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈసారైనా ఎన్టీఆర్‌ని పూరి బయటకు లాగుతాడో లేదో చూడాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని పూరి భావిస్తున్నాడు.